BRS | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ శనివారం పరామర్శించారు. కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ముక్తార్ కుమారుడు మొహమ్మద్ ఉస్మాన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉస్మాన్ కాలుకు తీవ్రగాయమైంది.
ఇటీవల కాలుకు సర్జరీ కావడంతో ఈ విషయం తెలుసుకున్న షేక్ జుబేర్ కోటగిరి లోని బాధితుడి ఇంటికి వెళ్లి ఉస్మాన్ ను పరామర్శించారు. రోడ్డు ప్రమాదం సంఘటన సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ తరఫున తమ వంతు సహాయం చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు కోటగిరి మోరే కిషన్, పోతంగల్ సూధం నవీన్, కోటగిరి సమీర్ తదితరులు పాల్గొన్నారు.