ఇందల్వాయి(డిచ్పల్లి), ఫిబ్రవరి 8 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను శనివారం దహనం చేశారు.
నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, ప్రైవేట్ కళాశాలలు మూసి వేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, బడ్జెట్లో టీయూకు రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.