Suspended | పెద్ద కొడప్ గల్, డిసెంబర్ 03 : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న పలువురిని కాంగ్రెస్ నాయకులను పార్టీ నుండి సస్పండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడుతున్న నాయకులు నాగిరెడ్డి మాజీ సర్పంచ్, బస్వరాజ్ దేశాయ్, అంజనీ నాందేవ్ పటేల్ కు జుక్కల్ శాసన సభ్యులు తోట లాక్ష్మికాంత్ రావు ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేస్తునట్లు పత్రిక సమావేశంలో ప్రకటించారు.
పార్టీ కోసం పని చేసే నాయకులు, కార్యకర్తలకు పార్టీ లో సముచిత స్థానం కల్పించనున్నట్లు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతేరేక పనులు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిప్ప మోహన్, అక్కల్ సాయిరెడ్డి, మనిక్ రెడ్డి, సంజీవ్, కల్లూరి పందిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.