
Bank 2
Karur Vysya Bank | కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరూర్ వైశ్య బ్యాంకు నూతన కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పప్పుల రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత బ్యాంకు లావాదేవీలు డిపాజిట్లు భారీగా పెరిగాయని వ్యాపార వాణిజ్య కార్యకలాపాల నిర్వహణ పెరిగిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
ప్రజల సౌకర్యార్థం జాతీయ బ్యాంకులు బ్యాంకింగ్ సేవలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం అభినందనీయమని ఆయన తెలిపారు. కరూర్ వైశ్య బ్యాంకు ప్రస్తుతం విద్యానగర్లో అందుబాటులోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి మరింత పేరు తెచ్చుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రవీందర్ మరియు గౌరీశెట్టి లక్ష్మి రాజం, గౌరీశెట్టి సంతోష్ కరూర్ వైశ్యా బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.