Nizamabad | కంటేశ్వర్, నవంబర్ 10 : మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద మైనార్టీకు ప్రభుత్వము ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున వెంటనే అర్హులైన నిరుపేదలస్తులకు -ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అందించాలని నిజామాబాద్ పట్టణ సారంగాపూర్ 13వ డివిజన్ బీఆర్ఎస్ ఇంచార్జి మహమ్మద్ అక్బర్ నమాజుద్దీన్ డిమాండ్ చేశారు. ప్రజావాణిలో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల సమయంలో నూతనముగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీలకు ఆర్థికముగా చాల విధాలుగా ఆదుకొంటామని హామీలు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొన్నప్పటికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అని అన్నారు. రాజీవ్ వికాస్ పథకం ద్వారా బ్యాంకు సబ్సిడీ లోన్స్ మైనార్టీలకు ఇస్తామని ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొమ్మని చెప్పి ఇప్పటి వరకు ఆ పథకము అమలు చేయలేదని, పోస్ట్ మ్యాట్రిక్, ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు పెండింగ్లోఉన్నాయని, వెంటనే విడుదుల చేయాలని డిమాండ్ చేశారు.
రూ.50వేలు వితంతువులకు ఆర్థిక సహాయం ఇస్తామని ఆన్లైన్ అప్లికేషన్ అర్హుల నుండి తీసుకొన్నారని, కానీ ఇప్పటి వరకు వారికి డబ్బులు ఇవ్వలేదని, కావున వెంటనే విడుదల చేయాలి అని అన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇమాం, మౌజన్లకు నెలసరి హానరోరియం డబ్బులను పెంచి ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు పెంచి ఇవ్వలేదని కాబట్టి ప్రభుత్వ మైనారిటీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.