Tandoor | నాగిరెడ్డి పేట్ : తాండూర్ గ్రామ శివారులో తాము ఆరేళ్లుగా కాస్తులో ఉన్న స్థలాలకు పట్టాలని ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ నినాదాలు చేపట్టారు.
అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాజేశ్వర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము ఏ ఆధారం లేకుండా ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్నామని, కావున తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.