డిచ్పల్లి, సెప్టెంబర్ 15 : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నటు ్లప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, నరాల సుధాకర్ తెలిపారు.
ఈ మేరకు వారు తెలంగాణ యూనివర్సిటీలోని పరీక్షల నిర్వహణ అధికారి సంపత్‌కుమార్, ఆడిట్‌సెల్ జాయింట్ డైరెక్టర్ అతిక్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.