కంఠేశ్వర్ ఏప్రిల్ 22 : అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత హెల్త్ కార్డులు జారీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఉచితంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించడం అభినందనీయం అన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నిజామాబాద్ వెల్నెస్ దవాఖాన యాజమాన్యం జర్నలిస్టుల కోసం ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు అందించడం అభినందనీయమన్నారు. రెండు, మూడు రోజుల్లో ఇండ్ల స్థలాల కోసం రెవెన్యూ మంత్రితో సమావేశం ఉందని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
వెల్నెస్ హాస్పిటల్ ఎండీ అసద్ మాట్లాడుతూ..2018లో అమీర్‌పేటలో ప్రారంభమైన వెల్నెస్ సేవలు నేడు 7 బ్రాంచులు పూర్తి చేసుకొని, ఎనిమిదవ బ్రాంచ్ ప్రారంభించనున్నామన్నారు. జర్నలిస్టు మిత్రులు కలసినపుడు ఏదైనా చేయాలని ఆలోచించామని ఈ ఉచిత హెల్త్ కార్డుల ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు అత్యాధునిక చికిత్సలు పూర్తి ఉచితంగా అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డా. కవిత రెడ్డి, డీపీఆర్వో పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.