Kallur | పోతంగల్ జనవరి 12: ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ యోజన చెక్కులను మండలంలోని కల్లూర్ కెనరా బ్యాంకులో ముగ్గురు పాలసీ దారులకు బ్యాంకు అధికారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం లో భాగంగా సంవత్సరానికి కేవలం రూ.436 ప్రీమియం చెల్లిస్తే రూ.2లక్షల వరకు కుటుంబాలకు బీమా ఉంటుందని, దీంతో రక్షణ కల్పించవచ్చని తెలిపారు.
ఏ కారణం చేతనైనా పాలసీ దారుడు మరణిస్తే, రూ. రెండు లక్షలు నష్టపరిహారంగా అందుతుందని చెప్పారు. 18 నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ ప్రీమియం చెల్లించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామ్ రెడ్డి. నాయకులు లింగప్ప, సాయినాథ్, వడ్ల సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.