Dharpalli | ధర్పల్లి, ఫిబ్రవరి 23 : లబ్ధిదారులకు పింఛన్లను సక్రమంగా అందజేయాలని ధర్పల్లి ఎంపీడీవో లక్ష్మారెడ్డి సూచించారు. ధర్పల్లి మండలంలోని ప్రాజెక్టు రామడుగు గ్రామంలో వృద్ధాప్య పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో లక్ష్మారెడ్డి సోమవారం తనిఖీ చేశారు.
గ్రామంలో వృద్ధుల సౌకర్యార్థం రెండు చోట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడాన్ని ఎంపీడీవో అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో స్వయంగా ఆసరా లబ్ధిదారులు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ గౌడ్, చేయూత పింఛన్ల మండల కో ఆర్డినేటర్ రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.