చెన్నారావుపేట, అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ధర్మతండా పరిధికి చెందిన మాజీ ఉప సర్పం చ్ భూక్యా వీరాసింగ్, యూత్ నాయకుడు భూక్యా రాజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం నల్లబెల్లిలోని పెద్ది నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం పెద్ది మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో రైతులు, మహిళలు, యువకులను మో సం చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ నా యకత్వంలో మండలంలో తాను చేసిన అభివృద్ధే కనిపిస్తున్నదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే మండలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, ఎన్నికల మండల కన్వీనర్ జక్క అశోక్, పార్టీ మం డల ప్రధాన కార్యదర్శి భూక్యా రవి, నాయకులు బుర్ర సుదర్శన్‌గౌడ్, భద్రూనాయక్, బాలూనాయక్ పాల్గొన్నారు.