murder case | వినాయక్ నగర్, అక్టోబర్ 1 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం తాగి ఎందుకు డబ్బుల కోసం ఓ వ్యక్తిని దారుణంగా గొంతుకు ఉరివేసి హత్య చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. హత్యకు గురైన వ్యక్తి వివరాలు సైతం తెలియకపోవడంతో గత 25 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన వన్ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి దర్యాప్తు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు. దీంతో అయితే జరిగిన పరిసర ప్రాంతాల లో ఉన్న సీసీ కెమెరాల రికార్డింగ్స్‌ను పోలీసులు పరిశీలించి కేసును ఛేదించారు.
ఎస్‌హెచ్‌వో రఘుపతి కథనం ప్రకారం.. సెప్టెంబర్ 6న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గల ఓ కిరాణా షాపు ముందర గుర్తు తెలియని వ్యక్తి అనుమానస్పదంగా మృతి చెంది ఉండడంతో స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి మెడకు గుర్తులు ఉండడంతో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తాడు లాంటి దాంతో మెడకు బిగించి హత్య చేసినట్లుగా తేల్చారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు.
మంగళవారం నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కోటగిరి మండలం జిల్లాపల్లి పామ్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. దీంతో నిందితుడు ఆధ్యా తానే చేసినట్లుగా అంగీకరించాడని వెల్లడించారు. గత నెల 6న రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆ వ్యక్తిని మద్యం తాగిందుకు డబ్బులు అడిగినందుకు ఇవ్వానని సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించి అతడిని హత్య చేసి మృతుడి జేబులో నుండి రూ.2వేలు, సెల్ ఫోను దొంగిలించకపోయినట్లు నిందితుడు అంగీకరించాడని వివరించారు. దీంతో నిందితుడు పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి పేర్కొన్నారు.