మాగనూరు, అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ను పంచాయతీ కార్యదర్శి ఉల్లంఘించిన ఘటన నారాయణపేట జి ల్లాలో చోటుచేసుకున్నది. కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నియమాలను మాగనూరు మండలం బైరంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాములు పాటించలేదు.
‘మన జన్మస్థలం బైరంపల్లి’ అన్న వా ట్సాప్ గ్రూప్లో గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మంజూరైనట్టు పోస్ట్ పెట్టాడు. లబ్ధిదారులు కావలి కవిత, పూజారి శోభ ఖాతాల్లో డబ్బులు జమైనట్టు పోస్టుచేశాడు. ఎంపీడీవో శ్రీనివాసులును వివరణ కోరగా.. విచారణ చేపట్టి వాస్తవమని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు.