Elephant | బోట్స్వానా (Botswana)లో కొందరు టూరిస్ట్‌లకు (Tourists) భయానక అనుభవం ఎదురైంది. సఫారీ కానో టూర్ సందర్భంగా కొందరు అమెరిన్, బ్రిటిష్ టూరిస్ట్‌లు ఏనుగులను చూసేందుకు వెళ్లారు. అక్కడ పిల్ల ఏనుగులను చూస్తుండగా.. వారిపైకి ఓ తల్లి ఏనుగు (Elephant) దాడి చేసింది.
ఒకవాంగో డెల్టా (Okavango Delta)లోని నిస్సార జిల్లాలో సెప్టెంబర్ 27న ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు టూరిస్ట్‌లు స్థానికంగా ఉన్న పార్క్‌కు వెళ్లారు. అక్కడ వారు బోటులో ప్రయాణిస్తూ (Boat Tour) ఏనుగులను తిలకిస్తున్నారు. ఇంతలో ఓ తల్లి ఏనుగు గర్జిస్తూ వారిని వెంబడించింది. టూర్ గైడ్లు బోట్లను చాలా ఫాస్ట్‌గా ముందుకు పోనిచ్చారు. అయినా ఏనుగు వారిని వెంబడించి దాడి చేసింది. ఏనుగు దాడిలో ఓ మహిళ నీటిలో పడిపోయింది. అయితే, ఆమె ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఈ ఏనుగు దాడిలో టూరిస్ట్‌ల ఫోన్లు, కెమెరాలతోపాటూ సిబ్బంది వ్యక్తిగత ఎలక్ట్రానిక్స్ వస్తువులు దెబ్బతిన్నట్లు సఫారీ సిబ్బంది తెలిపారు. ఈ ఘటనతో అక్కడున్న టూరిస్ట్‌లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృష్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
So this happened in the shallow waters of the Okavango Delta, Botswana, on Saturday…🐘pic.twitter.com/oF6SU2Q6r2
— Volcaholic 🌋 (@volcaholic1) September 29, 2025
Also Read..
RBI Repo Rate | ఆర్బీఐ కీలక ప్రకటన.. వడ్డీరేట్లు మరోసారి యథాతథం
Navratri feast | నో ఎంట్రీ జోన్లోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మందికి గాయాలు
Killer wolfs | బహరాయిచ్‌లో మరోసారి తోడేళ్ల దాడులు.. అటవీ అధికారులపై కర్రలతో దాడి చేసిన గ్రామస్థులు