Navratri feast | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని జబల్పూర్ (Jabalpur) జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. నవరాత్రి విందు సందర్భంగా విధించిన నిషేధిత ప్రాంతంలోకి ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (bus crashes into no entry zone) దూసుకెళ్లింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి సిహోరా పట్టణంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో నో ఎంట్రీ జోన్‌గా ప్రకటించారు. అయితే, ఓ బస్సు నిషేధిత ప్రాంతంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Road Accident | పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Killer wolfs | బహరాయిచ్‌లో మరోసారి తోడేళ్ల దాడులు.. అటవీ అధికారులపై కర్రలతో దాడి చేసిన గ్రామస్థులు
LPG Cylinder Prices Hike | పండుగల వేళ పెరిగిన గ్యాస్ ధర.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.15.50 వడ్డన..!