RBI Repo Rate | పండగ వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బుధవారం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 5.5 శాతం రెపోరేటు కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిజర్వుబ్యాంక్ మూడు విడతలుగా వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి, ఏప్రిల్ సమీక్షల్లో 0.25 శాతం చొప్పున కీలక రేట్లను తగ్గించిన ఆర్బీఐ.. జూన్‌లో నిర్వహించిన సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. మూడు వరుస సమీక్షల్లో కలిపి ఒక్క శాతం లేదా 100 బేసిస్ పాయింట్లను తగ్గించింది. ఇప్పుడు మరోసారి యథాతథంగా ఉంచింది. కాగా, తర్వాత జరిగే అంటే డిసెంబర్ సమీక్షలో మాత్రం రెపోరేటు పావు శాతం తగ్గి 5.25 శాతానికి దించవచ్చని మార్కెగ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
మరోవైపు చిన్న మొత్తాలపై వడ్డీరేటును మరోసారి యథాతథంగా ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1 నుంచి మూడు నెలల పాటు ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు కొనసాగనున్నాయని తెలిపింది. దీంతో చిన్న మొత్తాలపై వడ్డీరేట్లను ముట్టుకోకపోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు) చిన్న మొత్తాలపై వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నోటిఫికేషన్లో వెల్లడించింది. దీంతో సుకన్య సమృద్ధి పథకం కింద వడ్డీరేటు 8.2 శాతంగాను, అలాగే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)పై 7.1 శాతం, పోస్టాఫీస్ పొదుపు డిపాజిట్ స్కీంపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
Also Read..
Navratri feast | నో ఎంట్రీ జోన్లోకి దూసుకెళ్లిన బస్సు.. 13 మందికి గాయాలు
Killer wolfs | బహరాయిచ్‌లో మరోసారి తోడేళ్ల దాడులు.. అటవీ అధికారులపై కర్రలతో దాడి చేసిన గ్రామస్థులు
LPG Cylinder Prices Hike | పండుగల వేళ పెరిగిన గ్యాస్ ధర.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.15.50 వడ్డన..!