అర్ధనగ్నంగా కార్మికుల నిరసన
వేతనాల తగ్గింపు జీవోను వెంటనే రద్దు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ డెయిలీ వేజెస్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, అశ్వారావుపేటలో బుధవారం 20వ రోజుకు చేరింది.
- సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
- ఇల్లెందు, అశ్వారావుపేటలో 20వ రోజుకు చేరిన సమ్మె
అశ్వారావుపేట/ ఇల్లెందు, అక్టోబర్ 1 : వేతనాల తగ్గింపు జీవోను వెంటనే రద్దు చేయాలని, అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ డెయిలీ వేజెస్, ఔట్ సోర్సింగ్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, అశ్వారావుపేటలో బుధవారం 20వ రోజుకు చేరింది. ఇల్లెందులో ఒంటికాలిపై నిరసన తెలుపగా, అశ్వారావుపేటలో అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, పిట్ల అర్జున్, బైటా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 20 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులతో ఇండ్లల్లో పండుగ చేసుకుంటుంటే, కార్మికులు పస్తులతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇల్లెందు శిబిరాన్ని డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు కాళంగి హరికృష్ణ, బయ్య అభిమన్యులు సందర్శించి, సంఘీభావం తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

