ఖలీల్వాడి, డిసెంబర్ 9 : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలు లో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు, మన ఊరు – మన బడి, హరితహారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు, కొత్త ఓటర్ల వివరాల నమోదు, ధరణి తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు స్పష్టమైన ప్ర ణాళికతో ముందుకు సాగాలన్నారు. కార్యక్ర మం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యక్రమం మధ్య లో నిలిచిపోకుండా గడువులోపు నూటికి నూరుశాతం పూర్తి చేసేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నా రు. మన ఊరు – మన బడి కింద కొనసాగుతున్న పనులను వేగవంతం చేస్తూ ఈ నెలాఖరు నాటికి పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు.నిధులు అందుబాటులో ఉన్నందున, పనులు పూర్తయిన వెంటనే ఎఫ్టీపీలు జనరేట్ అయ్యేలా చూడాలన్నారు.
పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నందున ప్ర భుత్వ బడులు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మారాలని కలెక్టర్ ఆకాంక్షించారు. హరితహారం నిర్వహణపై నిరంతరం దృష్టిని కేంద్రీకరించి ఉంచాలని, అన్ని రోడ్లకిరువైపులా ఏపుగా మొక్క లు ఉండేలా పకడ్బందీ పర్యవేక్షణ జరుపాలని ఆదేశించారు. బృహత్ పల్లెప్రకృతి వనాలు, మినీ బృహత్ పల్లెప్రకృతి వనాలు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటులో అలసత్వం వీడాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీలో సగటున 12 వేల చొప్పున మొక్క లు పెంచేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల తుదిదశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓట రు ప్రత్యేక నమోదు కార్యక్రమం సందర్భంగా వ చ్చిన అన్ని దరఖాస్తులను తక్షణమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా 98 శాతం ఆధార్ సీడింగ్ జరగాలని, ఓట రు నమోదు, మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన పక్కాగా జరగాలని కలెక్టర్ సూచించారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి సమాచారాన్ని వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్, డీఎంహెచ్వో సుదర్శనం, అధికారులు పాల్గొన్నారు.