కోటగిరి అక్టోబర్ 29 : విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో తాళ్ల శ్రీనివాస్ (52) అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఇనుప మెట్లపై కూర్చోగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, శ్రీనివాస్ సోదరుడు ఐదు రోజుల క్రితం మృతి చెందాడు.
మంగళవారం రాత్రి ఇంట్లో దినకర్మ చేశారు. రాత్రి భోజనం చేసిన తర్వాత శ్రీనివాస్ తన ఇంటి ఆవరణలో ఉన్న ఇనుప మెట్లపై కూర్చున్నాడు. విద్యుత్ మీటర్ సర్వీస్ వైరు మెట్లపై తెగి పడింది. దీంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదచేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ సునీల్ తెలిపారు.