మోర్తాడ్, ఆగస్టు 15: ఎస్సారెస్పీలోకి శుక్రవారం 25,676 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1080.70 అడుగుల (46.952టీఎంసీలు)నీటినిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 6,413 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతున్నది.
కాకతీయ కాలువకు 5 వేలు, సరస్వతీ కాలువకు 500, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 502 క్యూసెక్కుల నీరు ఆవిరిరూపంలో వెళ్తున్నది.
బోధన్ రూరల్, ఆగస్టు 15: ఎగువ ప్రాంతంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సాలూరా మండల శివారులోని మంజీరా నదీ పరవళ్లు తొక్కుతున్నది. అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన సాలూర వద్ద పురాతన వంతెనను తాకుతూ ప్రవహిస్తున్నది.