Nizamabad | పోతంగల్, ఏప్రిల్ 16 : పోతంగల్ మండలంలోని ప్రతీ గ్రామంలో పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం మండల ప్రత్యేక అధికారి మున్ని నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రజాప్రతినిధులు గ్రామంలోని సమస్యలను వివరించారు. అవసరమగు అధికారులు లేకపోవడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని సంక్షేమ పథకాలు అమలు కాకుండా తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ పాఠశాలలో బాలురకు బాలికలకు వేరువేరుగా మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని అన్నారు.
మండలకేంద్రంలో సమీకృత భవనం భూమి పూజకు పరిమితమైందని, విషయంపై ఉన్నతాధికారులకు నివేదించి నిర్మాణ పనులు ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో విష్ణు, ఎంపీడీవో చందర్, ఎంఈఓ శంకర్, సర్పంచ్ల ప్లోరం అధ్యక్షుడు షాజీ పటేల్, వ్యవసాయ అధికారి నిషిత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగాధర్, ఆయా శాఖల అధికారులు మండలంలోని గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.