శక్కర్‌నగర్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని శక్కర్ నగర్లో ఎన్డీఎస్ఎల్ (NDSL) కార్మిక సంఘం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం చలో హైదరాబాద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం అర్ధరాత్రి కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. దీంతో కార్మికులు తమకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి విన్నవించెందుకుగాను సీఎం రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయించారు. అయితే తమ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించుకుందామంటే.. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని కార్మిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో కూడా రెండు మార్లు సీఎం కలిసేందుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో మరోమారు కలవాలనుకున్నామని తెలిపారు. అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్లో ఉంచడంతో ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఎన్డీఎస్ఎల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కార్మిక సంఘ నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, సత్య నారాయణ, భాస్కర్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.