తుంగతుర్తి, ఫిబ్రవరి 3 : నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రామాలయం ఆవరణలో రూ.12 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన కల్యాణ మండపానికి భూమి పూజ చేశారు. అనంతరం రూ.26 లక్షల వ్యయంతో జడ్పీహెచ్ఎస్లో నిర్మించిన అదనపు తరగతి గదులను, అదేవిధంగా రూ.12 లక్షలతో దేవునిగుట్ట తండాలో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామన్నగూడెం ఎంపీటీసీ, టీఆర్ఎస్ నాయకుడు అంబోతు నరేశ్ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపికాయుగంధర్‌రావు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరిగౌడ్, సర్పంచులు నల్లు రాంచంద్రారెడ్డి, వీరోజీ, వెంకన్న, ఎంపీటీసీ కేతిరెడ్డి లతావిజయ్కుమార్రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్‌బాబు, మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ఆలయ చైర్మన్ దుగ్యాల వెంకన్న, ఓరుగంటి సత్యనారాయణ పాల్గొన్నారు.
అర్వపల్లి/నాగారం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్వపల్లిలో 54 మంది, నాగారంలో 44 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డలకు పెండ్లి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను దేశంలోని పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్వపల్లి కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, సహకార సంఘం చైర్మన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, తాసీల్దార్ యాదగిరిరెడ్డి, సర్పంచులు సునీతారామలింగయ్య, పుప్పాల శేఖర్, పాలెల్లి సురేశ్, లునావత్ స్వాతి, గంగదారి వెంకటమ్మ, కుంభం ఉషారాణి, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎర్ర నర్సయ్య పాల్గొన్నారు. నాగారంలో ఎంపీపీ కూరం మణీవెంకన్న, తిరుమలగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య, సర్పంచ్ కుంభం కరుణాకర్, తాసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, ఆర్ఐ వహీద్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, దోమల బాలమల్లు, ప్రధాన కార్యదర్శి కేశగాని మహేందర్, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు పొదిల రమేశ్, చిరంజీవి పాల్గొన్నారు.
తిరుమలగిరి : మున్సిపాలిటీ పరిధిలోని మాలిపురం గ్రామంలో ఈ నెలలో జరిగే శీతలాదేవి, ముత్యాలమ్మ దేవతా పండుగ, వీరభద్రస్వామి ఉత్సవాలకు ఎమ్మెల్యే రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజనీరాజశేఖర్ ఎమ్మెల్యేను తిరుమలగిరిలోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వానపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు యాదగిరి, కుదురుపాక రాములు, వారన్న, సురేశ్ పాల్గొన్నారు.