బీఆర్ఎస్కు ఆటో యూనియన్ మద్దతు
బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
- ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఖలీల్వాడి, నవంబర్ 21 : బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆటో డ్రై వర్ల గురించి ఆలోచన చేశాడని, తమ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఫిట్నెస్ ట్యాక్స్ రద్దు చే శారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా తమ గురించి ఆలోచన చేయలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని ముక్తకంఠంతో నినదించారు.
బీఆర్ఎస్ ప్రజల ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తున్నది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నది. మా ఆటో డ్రైవర్ల గురించి గత ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచన చేయలేదు. మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్కే.
– అబ్దుల్ జబ్బార్,ఆటో డ్రైవర్
మా జీవితాల్లో వెలుగు నింపారు
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మా జీవితాల్లో వెలుగులు నిండాయి. ఒకవైపు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఆటోలపై ఫిట్నెస్ ట్యాక్స్ను కూడా రద్దు చేశారు. ఇంతకన్నా ఏం కావాలె. మా గురించి ఆలోచన చేసిన బీఆర్ఎస్కే మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం.
-శంకర్ ,ఆటో డ్రైవర్
మా గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి కేసీఆర్
మా బతుకుల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అందరం సంతోషంగా ఉన్నాం. వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. బీఆర్ఎస్ అభ్యర్థి గణేశ్ గుప్తాకే మా ఓటు.
-సాయిలు , ఆటో డ్రైవర్
గతంలో మా గురించి ఎవరూ పట్టించుకోలేదు
గత ప్రభుత్వాలు ఎన్ని ఏండ్లు పాలించినా మా గురించి పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్ ఒక్కరే ఆటోడ్రైవర్ల్ల జీవితాల గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ బీఆర్ఎస్కే మా సంపూర్ణ మద్దతు.
– పాషా , ఆటో డ్రైవర్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

