పెబ్బేరు, జూలై 13 : ఎన్నికల సంఘం చేపట్టిన సర్ కార్యక్రమాన్ని బీఎల్వోలు వేగవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. రాబోయే మూడు రోజుల్లో 70శాతం పూర్తి చేసేందుకు కృషి చే యాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం పెబ్బేరు మున్సిపాలిటీ, రంగాపురం, సూగూరు, బున్యాదిపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించా రు. ఈ సందర్భంగా పెబ్బేరులో బీఎల్వోలతోపాటు బీఆర్ఎస్కు చెందిన బీఎల్ఏలతో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమంలో బీఎల్ఏలు చురుకుగా పాల్గొనాలని, ప్రజల్లో అవగాహన కల్పిం చాలని సూచించారు.
అర్హులైన ప్రతి ఓటరును నమోదు చేయించాలని, ఎవరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సర్ కార్యక్రమంలో మండలంలోనే బున్యాదిపురం ముందుండడంపై సర్పంచ్ విజయగౌడ్, గ్రామ కార్యదర్శిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో మం డల బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు, పట్టణ పార్టీ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, సర్పంచులు హేమలత, యాదమ్మ, కౌన్సిలర్లు సౌజ న్య, శంకర్‌నాయుడు, మన్యం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విశ్వ రూపం తదితరులు పాల్గొన్నారు.