Mission Bhagiratha | పోతంగల్ ఫిబ్రవరి 25: వృథాగా మిషన్ భగీరథ నీరు.. అసలే ఎండ కాలం ఇటు వైపు చూడండి సారూ.. హెడ్డింగ్‌తో నమస్తే తెలంగాణ వెబ్సైట్లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకై నీరు వృథాగా పోతుండటంతో మరమ్మతులు చేపట్టారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో హాంగర్గ వెళ్ళే మార్గంలో మంగళవారం ఉదయం మిషన్ భగీరథ పైపులైన్ వాల్స్‌లో లీకేజీ కారణంగా నీరు వృథాగా పోయింది. అసలే ఎండలు రోజురోజుకు ముదురుతుండటంతో పాటు.. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వాటర్‌మ్యాన్ నిర్లక్ష్యంగా కారణంగా తాగునీరు వృథాగా పోవడంతో.. పైపులైన్ మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరారు. ఈ క్రమంలోనే నమస్తే తెలంగాణ వెబ్సైట్లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు మరమ్మతులు చేపట్టారు. సూపర్వైజర్ చైతన్య సిబ్బంది ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.