పోతంగల్, ఫిబ్రవరి 25: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇంటింటికీ తాగునీటి సరఫరా పథకం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. పైపులైన్ల లీకేజీలతో మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీరంతా వృథాగా పోతున్నది. సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో హాంగర్గ వెళ్ళే మార్గంలో వెల్డింగ్ షాప్ ప్రక్కన మిషన్ భగీరథ పైపులైన్ వాల్స్ లోనుంచి లీకేజీతో నీరు వృథాగా పోతోంది.
ఒకపక్క ఎండలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నీటి ఎద్దటి ఏర్పడిది. మరికొన్ని చోట్ల పంచాయతీ సిబ్బంది, వాటర్ మెన్ నిర్లక్ష్యంతో తాగునీరు వృథాగా పోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పైపులైన్ మరమ్మతు చేసి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.