Armur | ఆర్మూర్ టౌన్ : మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు మంగళవారం మున్సిపాల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పోలా సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని, వారికి వచ్చే లబ్ధి కూడా వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవకతలను సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు ఆదుకోవాలని కోరారు.
మున్సిపల్ శాఖ అధికారులు స్పందించకుండా కలెక్టరేట్ ను కూడా మున్సిపల్ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరఫున ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కార్మికులకు వెంటనే ఆదుకోవాలని తెలిపారు. సమాన పనికి సమాన వేతనం కూడా అందించాలన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని ఖండించారు కార్మికులకు కనీసం సదుపాయాలు కల్పించకపోవడం ఏంటని ప్రశ్నించారు.