Prakash Raj : కేంద్ర విద్యాశాఖ మంత్రి (Union Education Minister) ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా నేపథ్యంలో.. ‘నిరంకుశ ప్రభుత్వాన్ని మోకాళ్లపై వంగబెట్టగలమని బొద్దింకలు నిరూపించాయి’ అని నటుడు ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) అన్నారు. దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ పరిణామాలపై నిత్యం తనదైన శైలిలో నిలదీసే ప్రకాశ్ రాజ్… తాజాగా ప్రధాన్ రాజీనామాపై స్పందించారు. సీజేపీ ఆధ్వర్యంలో సాగిన పోరాటాన్ని, దానికి మద్దతుగా నిలిచిన సోనమ్ వాంగ్చుక్ను, యువతను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఆమె పదునైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాన్ని, అధికారాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ ఉదంతం నిరూపించిందని ప్రకాశ్ రాజ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నా ప్రియమైన ‘కాక్రోచెస్ (బొద్దింకలు)’ కు నా అభినందనలు. ప్రియమైన సోనమ్ వాంగ్చుక్ సర్.. యువత పక్షాన నిలబడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నిరంకుశ పాలకులను సైతం మోకాళ్లపై వంగబెట్టగలమని మీరు నిరూపించారు’ అని పేర్కొన్నారు. ఆ పోస్టుకు #justasking అనే హాష్ట్యాగ్ను జోడించారు.