Sonam Wangchuk : కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్నిపర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యం సాధించిన విజయం అన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన కాక్రోచ్ జనతా పార్టీకి, జన్ జీకి, దేశ ప్రజలను సోనమ్ అభినందించారు. ఈ మేరకు శనివారం తన సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు.
ఇది ప్రజాస్వామ్య విజయం. వీధుల్లోంచి ప్రజాస్వామ్యమే సాధించుకున్న విజయం. ఇది పట్టుదల, శాంతి, సహనంతో సాధించుకున్న విజయం. సీజేపీకి, జన్ జీకి అభినందనలు. దేశమంతా కలిసి భయాన్ని జయించి, దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన పౌరులందరికీ కృతజ్ఞతలు. జవాబుదారీతనం, సంస్కరణలు అందుతున్నాయి అంటూ సోనమ్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యతవహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ సోనమ్ వాంగ్చుక్ 26 రోజులుగా నిరాహారదీక్ష చేసిన సంగతి తెలిసిందే.
రెండు రోజుల క్రితమే ఆయన తన దీక్ష విరమించారు. శనివారం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో సీజేపీ ఉద్యమకారులుసహా, ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీజేపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.