KTR | యావత్ దేశాన్ని కుదిపేసిన నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజీపీ కాంక్రోచ్ జనతా పార్టీతోపాటు విద్యార్థుల ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం సీజీపీ నేతలను చర్చలకు కూడా ఆహ్వానించింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది. జెన్ Z ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
విద్యార్థులకు మద్దతుగా.. కేంద్రాన్ని నిలదీసిన కేటీఆర్
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాష్టీకానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద (జులై 24న)శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి మహానగరంతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది యువతీ యువకులు దండుకట్టి తరలివచ్చారని తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై భావోద్వేగంతో ప్రసంగించారు. ‘పరీక్ష పే చర్చ పెట్టిన మీరు పేపర్ లీకేజీలపై ఎందుకు పెట్టలేదు? ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?’ అని కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీలో పిల్లలపై దాడులను చూస్తుంటే ఇద్దరు పిల్లల తండ్రినైన తన మనస్సు చలించిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
మోదీ, రేవంత్ ప్రభుత్వాలపై తనదైన శైలిలో పంచులు విసిరారు. ఢిల్లీలో యువతపై మోదీ సర్కార్ సాగిస్తున్న దమనకాండను కండ్లకుకట్టారు. రేవంత్ దాగుడు మూతలను ఎత్తిచూపారు. ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం పోరాడుతున్న యువకులపై ఉగ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్థాన్ నుంచి నిధులు వస్తున్నాయని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నిజంగానే కేంద్రానికి బాధ్యత ఉంటే ఉద్యమిస్తున్న విద్యార్థుల వద్దకెళ్లి చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సి ఉండేదన్నారు.
“Power of people is always greater than the people in power “
Gen Z ✌️
— KTR (@KTRBRS) July 25, 2026