MRO Office | తహసీల్దార్ కార్యాలయం అంటే రోజూ ఎంత మంది వచ్చిపోతుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మండల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం ఏదో సర్టిఫికెట్ కోసమో, భూ సమస్య పరిష్కారం కోసమో, ఇతర సేవల కోసం ఎమ్మార్వో ఆఫీస్కు వస్తుంటారు. నిర్దేశించిన పని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎమ్మార్వో ఆఫీస్కు తాళం వేస్తే.. అది కూడా ఓ పెండ్లి ఫంక్షన్ కోసం చేస్తే ఎలా ఉంటుంది. ఇదే జరిగింది నిజామాబాద్ జిల్లాలో ఇదే జరిగింది.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఎమ్మార్వో ఆఫీసులో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా ఆర్ఐ ఇంట్లో జరుగుతున్న పెళ్లికి వెళ్లారు. సిబ్బంది నిర్వాకంతో అర్జీదారులకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అధికారులు వస్తారేమో అని ఆఫీసులో ప్రాంగణంలో గంటల తరబడి వేచి చూసి వెళ్లిపోయారు. విధుల పట్ల ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఎలా ఉందో చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మార్వో ఆఫీసుకు తాళం వేసి పెళ్లికి వెళ్ళిన సిబ్బంది
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని ఎమ్మార్వో ఆఫీసులో విధులకు హాజరు కాకుండా ఆర్ఐ ఇంట్లో పెళ్లికి వెళ్ళిన ఉద్యోగులు pic.twitter.com/26xrYasg97
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026