ఖలీల్వాడి/ భిక్కనూర్, మే 16: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్, దోమకొండ, నిజామాబాద్ జిల్లా చందూర్, డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది.
దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లతోపాటు ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి గంటపాటు వర్షం కురిసింది. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షంతో నగరం చల్లబడింది. గత కొన్నిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు.. వర్షం కురవడంతో ఉపశమనం పొందారు.