MLC Kavitha: రెంజల్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) రేపు రెంజల్ మండలంలోని సాటాపూర్(Satapur) గ్రామం వెళ్లనున్నారు. అక్కడ కోటిన్నర వ్యయంతో నూతనంగా నిర్మించిన సీతారామాలయాన్ని శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కవిత సందర్శించనున్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. కవితతో పాటు బోధన్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుంటారు.
నిరుడు సాటాపూర్లోని పాత రామాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి కొత్త గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ కవిత. ఆ సందర్భంగా ఆమె ఆలయ నిర్మాణం కోసం తన వంతుగా రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు.