Collector kranthi Valluri | పటాన్చెరు జూన్ 5 : క్యాసారం గ్రామంలో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం పటాన్చెరు మండలం క్యాసారం గ్రామంలో తహసీల్దార్ రంగారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుకు ఆకస్మికంగా వచ్చిన కలెక్టర్ అక్కడున్న ప్రజలను ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారని అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ వద్ద ఉన్న వివరాలు సేకరించి ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నది సుధీర్ఘకాలంగా పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకునేందుకు అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందజేసేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. భూ భారతి చట్టం ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా ఉందన్నారు. త్వరతిగతిన మీ సమస్యలను పరిష్కరించడమే మా ధ్యేయం అన్నారు. రెవెన్యూ సిబ్బంది మీకు అండగా ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ తహసీల్దార్ త్వరగా వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంగారావు పాల్గొన్నారు.
మొక్క నాటిన కలెక్టర్..
Collector Kranthi Valluri
ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని పంచాయితీ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు మొక్కను నాటాలని కోరారు. పర్యావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంతో ఉంటామన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని గ్రామస్తులకు సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు