– స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
బీబీనగర్, ఫిబ్రవరి 20 : బీబీనగర్ మండలం రహీంఖాన్‌గూడెం (అన్నవరం) గ్రామంలో శ్రీ పద్మావతి అలిమేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు దివ్య విమాన రథోత్సవం ద్వారా గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు హారతులు, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారిని భక్తిశ్రద్ధలతో స్వాగతించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో పాటు స్థానిక నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్, సర్పంచ్, ఉత్సవ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, మండల రైతు బంధు సమితి మాజీ కో ఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు రాచమల్ల శ్రీనివాసులు, చింతల సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవ శృతి అరవింద్, ఆలయ కమిటీ చైర్మన్ పంజాల విజయకుమార్ గౌడ్, ఉప సర్పంచ్ మంచాల ప్రభాకర్, నాయకులు మంచాల రవికుమార్, పిట్టల అశోక్, గాదె నరేందర్ రెడ్డి, కొలను దేవేందర్ రెడ్డి, కొంతం లింగయ్యగౌడ్, తంతరపల్లి ప్రదీప్ గౌడ్, పంజాల రామారావు, సత్యనారాయణగౌడ్, దేవరప్పుల పృథ్వీరాజ్, గూదె శ్రీశైలం పాల్గొన్నారు.

రహీంఖాన్‌గూడెంలో కొనసాగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు