కోస్గి : తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల ( Congress leaders ) దౌర్జన్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నారాయణపేట జల్లా కోస్గి మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తల ( BRS workers ) పై దాడులు చేసి గాయపరిచారు. 5వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు జి వెంకయ్య, బోడా వెంటయ్యపై అదే వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎల్లప్ప రాళ్లతో దాడి చేశాడు. దాడిలో ఇద్దరి తలలకు తీవ్రగాయాలయ్యాయి.
కాంగ్రెస్ దుండగులు చేసిన దాడిపై బాదితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, కాంగ్రెస్ మోసాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని నాయకులు హెచ్చరించారు.