ఖలీల్‌వాడి/శక్కర్‌నగర్, జూలై 25 : నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. బోధన్, నిజామాబాద్ అర్బన్ ని యోజకవర్గంలోని అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై ఎమ్మెల్యేలు షకీల్, గణేశ్ గుప్తాతో మాట్లాడారు. ముఖ్యంగా బోధన్‌లో రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధిపై ప్రభుత్వాని కి అందించాల్సిన ప్రతిపాదనలపై చర్చలు జరిపారు.
ఎమ్మెల్సీని కలిసిన బోధన్ నేతలు
బోధన్ కౌన్సిల్‌కు రూ. 25కోట్లు మంజూరు చే యించిన సందర్భంగా ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో మైనార్టీలకు 2వేల యూనిట్లు మంజూరు చేయించాలని ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ కవితకు నివేదించారు. కాగా, ఈ విషయంలో ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్,మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఎహెతెషాం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం,కౌన్సిలర్లు డేగావత్ధూప్సింగ్ నాయక్, అబ్దుల్లా, ధూలిపాల పౌల్, జావీద్, పార్టీ నాయకులు గంగారెడ్డి, సత్యం,పి.గంగాధర్ గౌడ్, ఆబేద్, అశ్వాక్ అహ్మద్ ఉన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితను కలిసి వినతిపత్రం అందించారు. వారి వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.