కాంగ్రెస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు
కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలోని మదర్సా నూర్మజీద్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పాల్గొన్నారు.
- సుదర్శన్‌రెడ్డి, అర్వింద్ ఒక్కటే..
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల
- దేశం, మతం పేరిట బీజేపీ ఓట్లు అడుగుతుంది
- నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
భీమ్‌గల్, ఏప్రిల్ 9: కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలోని మదర్సా నూర్మజీద్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌విందులో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, మోదీ ఎలాగో జిల్లాలో సుదర్శన్‌రెడ్డి, అర్వింద్ ఒక్కటేనని అన్నారు. గత ఎన్నికల్లో జగిత్యాలలో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి బహిరంగంగా అర్వింద్ గెలుపునకు సహకరించారన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బోధన్‌లో సుదర్శన్‌రెడ్డి గెలుపు కోసం అర్వింద్ బీజేపీ నుంచి బలహీన అభ్యర్థిని నిలబెట్టాడన్నారు. అందులో భాగంగానే ఇక్కడి వారికి పరిచయంలేని జీవన్‌రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి అర్వింద్‌కు సహకరిస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఇప్పటికైనా మైనార్టీ సోదరులు ఆలోచించాలని కోరారు. నిజామాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని చూపకుండా దేశం,మతం పేరిట బీజేపీ ఓట్లు అడుగుతున్నదని మండిపడ్డారు.
ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానన్న అర్వింద్.. ఐదేండ్లు గడిచినా బోర్డుకు అతీగతి లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏనాడూ ప్రజల మంచిచెడులో పాల్గొనలేదని విమర్శించారు. అనంతరం సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేము ల, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత, జడ్పీటీసీ రవి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోయిజ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్స య్య, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అజ్మత్, అప్సర్, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు శవ్వ అశోక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

