నవీపేట/రెంజల్, జూన్ 13: విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు అంకిత భావంతో పనిచేయాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెంజల్ మండలంలోని మోడల్‌స్కూల్, నవీపేట మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. ఇటీవల 11వేల టీచర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులను సంఖ్యను పెంచి వారికి నాణ్యమైన విద్యాబోధన చేయాలని సూచించారు.
మూడునెలలకోసారి తాను పాఠశాలలను తనిఖీ చేసి ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుపై ఆరా తీస్తానని అన్నారు. నాణ్యమైన చదువు అందించడంలో ఉపాధ్యాయులు విఫలం అయితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పదో తరగతిలో 10జీపీఏ సాధించిన విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈవో దుర్గాప్రసాద్, డీఆర్డీవో సాయాగౌడ్, ఎంపీపీ సం గెం శ్రీనివాస్, ఆర్డీవో రాజేందర్‌కుమార్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ రాజేందర్కుమార్గౌడ్, తహసీల్దార్ నారాయణ, ఎంఈవో గణేశ్‌రావు పాల్గొన్నారు.