రెంజల్, అక్టోబర్ 27 : బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు సంక్షేమ పథకాలు అందక, అభివృద్ధి కార్యక్రమాలు లేక గోసడుతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ అందక భూ ములు బీడుగా మారాయని తెలిపారు. అలాంటి పార్టీలు ఇక్కడ ఓట్లడిగేందుకు వస్తున్నాయని, వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మండలంలోని సాటాపూర్ గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బోధన్ ప్రాంతం గంగా జమునా తెహజీబ్లా ఆదర్శంగా నిల్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని తెలిపారు.
మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కొత్త పథకాలు రానున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా షకీల్‌ను గెలిపించుకుంటామని కార్యకర్తలు ముక్తకంఠంతో తెలిపారు. సర్పంచ్ వికార్‌పాషా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, ఉపాధ్యక్షుడు హాజీఖాన్, సర్పంచులు ఖలీంబేగ్, రమేశ్‌కుమార్, గణేశ్‌నాయక్, సాయిలు, విండో చైర్మన్లు ఇమ్రాన్బేగ్, మొహినుద్దీన్, ఎంపీటీసీలు హైమద్, అసద్బేగ్, మైనారిటీ జిల్లా నాయకుడు రఫీక్, గోపాల్‌రెడ్డి, నందకుమార్, మండల నాయకులు రాఘవేందర్, నర్సయ్య, సాయిరెడ్డి, లింగం, కాశం సాయిలు, మౌలానా, కిష్టయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.