జక్రాన్‌పల్లి, నవంబర్ 26: మండలంలోని బ్రాహ్మణ్‌పల్లి, తొర్లికొండ, పుప్పాలపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ్‌పల్లి నుంచి గాంధీనగర్ వరకు బీటీ రోడ్డుకు రూ.90లక్ష లు, తొర్లికొండ, మనోహరబాద్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.80లక్షలు, పు ప్పాలపల్లిలో బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.75 లక్షల నిధులు సీఆర్ఆర్ నుంచి మంజూరు అయ్యాయని తెలిపారు.
3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని త్వరలో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయారెడ్డి, బ్రాహ్మణ్‌పల్లి సొసైటీ చైర్మన్ నర్సారెడ్డి, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనక రవి, మాజీ ఎంపీపీలు అనంత్‌రెడ్డి, అప్పల రాజన్న, పార్టీ మండలాధ్యక్షులు చిన్నారెడ్డి, నాయకులు రమణారెడ్డి, చిన్నసాయరెడ్డి, నర్సారెడ్డి, వినోద్, సంపత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.