వినాయక్‌నగర్, సెప్టెంబర్ 22: నిజామాబాద్ జిల్లా పేరును ఇందూరుగా మార్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిజాం నవాబు నిరంకుశ పాలనలో వారికి అనుగుణంగా జిల్లాల పేర్లను మార్చుకున్నారని తెలిపారు.
ఆదిలాబాద్‌ను ఎదులపురంగా,వరంగల్ జిల్లాను ఓరుగల్లుగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. దమ్ముంటే హైదరాబాద్‌కు భాగ్యనగర్ అని పేరు పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం కాకుండా ప్రజా పాలన దినంగా నిర్వహించి ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు.. అవి 420 హామీలు అని విమర్శించారు.