భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 20 : భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడం గ్రామ పరిధిలోని విజే సాయి కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ట్రోలిన్ పేలి కార్మికుడు మృతి చెందాడు. బ్లాక్లో సుమారు 15 మంది కార్మికులు పనిచేస్తుండగా భోజన విరామ సమయంలో అందరు వెళ్లిపోయారని, ఒక్కడే మిగిలి ఉండగా ప్రమాదవశాత్తు ట్రోలిన్ పేలడంతో మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ధార పవన్(36) సీనియర్ కెమిస్ట్రీ కార్మికుడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, సీఐ రాములు, స్థానిక ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.