తాండూర్ : రాష్ట్రస్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలకు ( Wrestling competitions ) మండలంలోని అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని చౌళ్ల హర్షిత ( Harshita ) ఎంపికైనట్లు వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఏ సాంబమూర్తి తెలిపారు. ఈ నెల 14న మంచిర్యాల డీవైఎస్వో గ్రౌండ్ లో నిర్వహించిన జిల్లా స్థాయి సీఎం కప్ రెజ్లింగ్ పోటీలలో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి ఎంపికయ్యిందని తెలిపారు.
ఎంపికైన విద్యార్థిని ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొననుందని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాద్యాయురాలు పీ ఉమాదేవి, ఏఏపీసీ చైర్మన్ చిలుకమ్మ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, తోటి విద్యార్థులు అభినందించారు.