AUS vs OMAN | టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. మూడో స్థానం దక్కేనా..?
AUS vs OMAN : గ్రూప్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా పరువుకోసం ఆడనుంది. గ్రూప్ బీలో మూడో స్థానం సాధించేందుకు శుక్రవారం ఒమన్‌తో తలపడుతోంది.
AUS vs OMAN : గ్రూప్ దశలోనే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన ఆస్ట్రేలియా పరువుకోసం ఆడనుంది. గ్రూప్ బీలో మూడో స్థానం సాధించేందుకు శుక్రవారం ఒమన్‌తో తలపడుతోంది. హ్యాట్రిక్ ఓటములతో ఎలిమినేటైన ఒమన్ సైతం మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటోంది. ఏకపక్షంగా సాగే అవకాశమున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఫేవరెట్‌గా వరల్డ్‌కప్ బరిలో నిలిచిన ఆస్ట్రేలియా ఒకేఒక విజయంతో సూపర్ 8కు దూరమైంది. జింబాబ్వే, శ్రీలంక పంచ్‌తో కుదేలైన ఆసీస్.. చివరి లీగ్ మ్యాచ్‌లో గెలుపుపై కన్నేసింది. విజయంతో టోర్నీకి వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్టు మార్ష్ చెప్పాడు. మూడుకు మూడింటా ఓడినప్పటికీ ఒత్తిడిలో ఉన్న ఆస్ట్రేలియాకు షాకిచ్చేందుకు ఇదే సరైన అవకాశమని ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ తెలిపాడు.
The final game of the group stage 🙌
Broken Australia look to avoid the ignominy of a third straight loss
🔗 https://t.co/id6N77jxVz pic.twitter.com/1YWL8txX1K
— ESPNcricinfo (@ESPNcricinfo) February 20, 2026
ఆస్ట్రేలియా తుది జట్టు : మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మ్యాట్ రెన్షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, గ్జావియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడం జంపా.
ఒమన్ తుది జట్టు : అమిర్ కలీం, జతిందర్ సింగ్(కెప్టెన్), కరరన్ సొనోవాలే, హమ్మద్ మిర్జా, వసీం అలీ, మొహమ్మద్ నదీమ్ వినాయక్ శుక్లా(వికెట్ కీపర్), జితేన్ రామనంది, జై ఒడెద్రా, షకీల్ అహ్మద్, షఫీక్ జన్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

