చందూర్, ఆగస్టు 23: చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వారం రోజులుగా నీటిఎద్దడి నెలకొన్నది. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతోపాటు చెరువువద్ద నీటి కోసం ఏర్పాటు చేసిన మోటారుపంపు సెట్లు పనిచేయడం లేదు.
ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లగా నిధులు లేవని సమాధానం చెబుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. నిత్యం నీటికోసం చుట్టు పక్కన పంట పొలాలు, సొసైటీ వద్ద గంటల తరబడి క్యూలో నిలబడి నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి ఎద్దడి తీర్చాలని కోరుతున్నారు.