MIM | శక్కర్ నగర్ : ఎంఐఎం బోధన్ పట్టణ అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలిని నియామకం చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణ ఎంఐఎం నూతన కమిటీని హైదరాబాద్ లో ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేతలు బుధవారం ఉత్తర్వులు అందజేశారు.
అధ్యక్షుడిగా మీర్ ఇలియాస్ అలీ, ప్రధాన కార్యదర్శిగా అహ్మద్ బిన్ మోసిన్, కోశాధికారిగా ఖదీర్ ఖాన్, సంయుక్త కార్యదర్శులుగా అఖిల్ ఫారుకి, హాజీ బిల్డర్ ను ఎంపిక చేయడంతో పాటు కార్యవర్గ సభ్యులుగా షేక్ సలాం ఛావుస్, మహమ్మద్ ఒమేర్, షేక్ అథర్, షేక్ అయుబ్, మహమ్మద్ అల్తాఫ్, సమీర్ హుస్సేన్, సయ్యద్ సల్మాన్ అతర్, అబ్దుల్ రషీద్ అహ్మద్, రాశేద్ లను ఎంపిక చేశారు.
కమిటీకి న్యాయ సలహాదారుగా న్యాయవాది వాజిద్ హుస్సేన్ ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మీర్ ఇలియాస్ అలీ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై పెట్టిన నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానని, నియామకానికి సహకరించిన పెద్దలకు, నాయకులకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.