గుట్టమీద గ్రామాలకు తాగునీరందిస్తా..
భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్, మానాల తదితర గుట్ట మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో పర్యటించారు.
- కోట్లాది రూపాయలతో గిరిజన తండాల అభివృద్ధి చేశా..
- పోడు భూములకు పట్టాలు అందజేశాం..
- మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులను దూరం చేశా..
- బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
- భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారం
భీమ్‌గల్, నవంబర్ 25 : భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్, మానాల తదితర గుట్ట మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషి చేస్తానని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం భీమ్‌గల్, వేల్పూర్ మండలాల్లో పర్యటించారు. ఉదయం భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్, తాళ్లపల్లి, గంగరాయి, కొత్తతండా, సాయంత్రం వేల్పూర్తోపాటు మోతెలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్, కారేపల్లి తదితర గ్రామాల్లో పోడు భూములకు పట్టాలిప్పించి భూమి హక్కులు కల్పించినట్లు తెలిపారు. 780 పోడు, 580 ఎకరాల అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పించినట్లు చెప్పారు. ఈ భూములకు గతంలో రైతుబంధు ఇతర ప్రయోజనాలు అందక రైతులు బాధపడేవారన్నారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా చేశానన్నారు. ఈ గ్రామాల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధిపనులు చేపట్టినట్లు వివరించారు. కాలు తీసి బయట పెడితే బురద ఉండే రోడ్ల స్థానంలో కాలికి బురద అంటకుండా తండాల్లో రోడ్లు, బీటీ రోడ్లు వేయించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ఇబ్బందులు దూరం చేశానన్నారు. గతంలో వాగులకు చెలిమల వద్దకు నీటి కోసం వెళ్లాల్సిన దుస్థితిలో తండాలుండేవని గుర్తు చేశారు. దేవక్కపేట్, మానాల తదితర గుట్టల మీద ఉన్న గ్రామాలకు తాగునీటిని అందించేందుకు కృషిచేస్తానని, మళ్లీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంజినీర్లు, ఆఫీసర్లు, గ్రామస్తులతో కలిసి పరిశీలిస్తామన్నారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించి సాధ్యమయ్యేలా చూస్తానన్నారు. అసైన్డ్ పట్టాలు కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాలేదని, గ్రామస్తుల బాధలు చూసి సాధ్యం చేశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఘనస్వాగతం లభించింది.
వేములకు మున్నూరుకాపు సంఘం మద్దతు
భీమ్‌గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామ మున్నూరుకాపు సంఘం సభ్యులు ఎన్నికల్లో వేములకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు శుక్రవారం దేవక్కపేట్కు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తీర్మాన కాపీని సంఘ సభ్యులు అందజేశారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

