పిట్లం/మద్నూర్/ నిజాంసాగర్, జనవరి 10: జిల్లాలోని రైస్‌మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్‌చెరువు గ్రామంలోని బిలాల్ రైస్‌మిల్‌ను బుధవారం తనిఖీ చేశారు. మిల్లులో ధాన్యం నిల్వ ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన వెంట బాన్సువాడ ఆర్డీవో భుజంగరావు, పిట్లం ఇన్చార్జి తహసీల్దార్ నాగేశ్, ఆర్ఐ శీతల్ ఉ న్నారు. నిజాంసాగర్, మద్నూ ర్ మండలాల్లో చేపడుతున్న ప్రజాపాలన డాటాఎంట్రీ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవోలు నాగేశ్వర్రావు రవీశ్వర్‌గౌడ్ ఉన్నారు.